అతిథీరావ్ హైద‌రీ అంత‌గా జీవించేసినా కానీ

న‌వాబ్ చిత్రంతో అతిథీరావ్ హైద‌రీ మ్యాజిక్ తెలిసిందే. సుధీర్ బాబు స‌ర‌స‌న స‌మ్మోహ‌నం చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత నానీ- సుధీర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న వీలోనూ న‌టిస్తోంది. అయితే వీ రిలీజ్ కి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఈ మూవీ రిలీజ్ అంత‌కంత‌కు వాయిదా ప‌డుతోంది.

అయితే ఈలోగానే అతిధీరావ్ న‌టించిన సూఫీయుం సుజాత‌యుం మ‌ల‌యాళ చిత్రం రిలీజైంది. ఈ సినిమాలో అతిధీ న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధం కాని ఆడియెన్ లేనేలేరు. హిందూ ముస్లిమ్ ప్రేమ‌క‌థా చిత్రంలో అతిధీరావ్ ముస్లిమును ప్రేమించే హిందూ యువ‌తిగా న‌టించింది. సినిమా ఆద్యంతం అతిధీ న‌ట‌న ర‌క్తి క‌ట్టించింది. అయితే ఈ సినిమా లో ల్యాగ్ స‌న్నివేశాలు ప‌ర‌మ బోర్ కొట్టించ‌డం ఖాయం. కానీ అతిధీ న‌ట‌న‌కు మాత్రం చ‌క్క‌ని పేరొచ్చింది. నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించే ఎక్స్ ప్రెష‌న్స్ తో ఈ అమ్మ‌డు ఆద్యంతం అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సోష‌ల్ మీడియాలో బోలెడంత ప్ర‌మోష‌న్ చేస్తోంది అతిధీరావ్. ఈ చిత్రంలో జ‌య‌సూర్య క‌థానాయ‌కుడు. అమెజాన్ ప్రైమ్ లో వీక్షించాల్సిందిగా అతిధీ బోలెడంత ప్ర‌మోషన్ చేస్తోంది.