వర్మపై ఏంటా సెటైర్స్.. నవ్వుతూ పగ తీర్చుకున్న నాగబాబు

Adirindi Fame Hari Satire On RGV

రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. వరుసగా సినిమాలను విడుదల చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నాడు. క్లైమాక్స్, నగ్నం, థ్రిల్లర్, డేంజరస్ వంటి బోల్డ్ కంటెంట్‌లతో పాటు పవర్ స్టార్, మర్డర్ వంటి వివాదాస్పద అంశాలతోనూ సావాసం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక వర్మ పవర్ స్టార్ అంటూ చేసిన రచ్చ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొరగడం, బెదిరింపులు తప్ప ఏమీ చేయలేరని, కావాలంటే అడ్రస్ చెబుతా రమ్మని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ ఫ్యాన్స్, ఓయూ స్టూడెంట్స్ ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి చేస్తే మాత్రం బాత్రూంలో వెళ్లి దాక్కున్నాడు. ఈ మేరకు బయటకు వచ్చిన వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఈ టాపిక్ చర్చనీయాంశమైంది. అదిరింది కామెడీ షోలో కమెడియన్ హరి.. వర్మపై వరుసగా పంచ్‌లు వేశాడు. హైపర్ ఆది టైపులో టకటకా సెటైర్లు వేస్తూనే వచ్చాడు. నాగబాబు పగలబడి నవ్వుతూనే ఉన్నాడు. ఇలాగైనా వర్మపై కసి తీర్చుకుందామని అనుకున్నాడేమో గానీ నాగబాబు నవ్వులు మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Nagababu laughing
Nagababu laughing

అదిరింది షోలో వేసే సెటైర్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి అందరికీ తెలిసింది. జడ్జ్‌లుగా ఉండే నాగబాబు, నవదీప్‌లు కూడా రెచ్చిపోయి మరీ కౌంటర్లు వేస్తుంటారు. తాజాగా వర్మపై పంచుల వర్షం కురిసింది. ‘అదిరింది’ రౌడీ బాయ్స్ టీమ్ లీడర్ హరి… రాంగోపాల్ వర్మపై సెటైర్లు వేశాడు. వైరస్ మనిషి రూపంలో వస్తే అది వర్మ అని… హీరోల ఫ్యాన్స్‌ను గెలికే వ్యక్తికి కూడా ఫ్యాన్స్ ఉంటారా అని, అది ధైర్యంగా ఉండటం కాదు.. తలుపు వెనక్కి వెళ్లి దాక్కోవడం అంటారు అని వర్మపై సెటైర్లు వేశాడు. ప్రస్తుతం అదిరింది ప్రోమో తెగ వైరల్ అవుతోంది.