టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఏడాది సగం పెళ్లిళ్ల వార్తలతోనే హైలెట్ అయ్యింది. లాక్ డౌన్ ను కొందరు టెన్షన్ లేకుండా ఉపయోగించుకొని ఏ హడావుడి లేకుండా సింపుల్ గా పెళ్లి చేసేసుకున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక వెడ్డింగ్ మిగతా వారితో పోలిస్తే కాస్త గ్రాండ్ గానే జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యింది. చాలా కాలం తరువాత మెగా హీరోలు మొత్తం ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు కూడా ఎంతగానో ఆనందపడ్డారు.
ఇక వేడుకకు చాలా వరకు మెగా కుటుంబ సభ్యులు మొత్తం 60 మందికి పైగానే పాల్గొన్నారు. కానీ పవన్ సతీమణి అన్నా లెజ్నెవా మాత్రం హాజరు కాలేదు. రేణు దేశాయ్ కూడా హాజరు కాలేదు. పిల్లలు అకిరా, ఆధ్య మాత్రమే వచ్చారు. రేణు దేశాయ్ విషయం పక్కనపెడితే అన్నా లెజ్నెవా రాకపోవడానికి కారణంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. నిజానికి ఆమె ఇండియాలో లేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది క్రిస్మస్ కోసం రష్యాలోని తన సొంత ఇంటికి వెళ్లే అలవాటు ఉందట.
పిల్లలను తీసుకొని వెళ్లిన ఆమె డిసెంబర్ మొదటి వారం నుంచి న్యూ ఇయర్ వరకు రష్యాలోనే ఉటుందట. అందుకే ఆమె పెళ్లికి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. కానీ నిహారిక కోసం మాత్రం ఒక స్పెషల్ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ తో పంపినట్లుగా టాక్ అయితే వస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక వేడుకలో ఎక్కువగా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం అకిరా నందన్ అనే చెప్పాలి. కాబోయే పవర్ స్టార్ హైట్ చూసి వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.