సినీపరిశ్రమలో ఎఫైర్లు వివాదాల గురించి చెప్పాల్సిన పనే లేదు. అన్నిచోట్లా ఉన్నా గ్లామర్ రంగంలో తుమ్మినా దగ్గినా దానికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటివి వైరల్ గా మారుతుంటాయి. తాజాగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు సోదరుడు శ్యామ్ కే నాయుడు ఎఫైర్ వార్త అలానే వైరల్ అయ్యింది. అప్పటికే పెళ్లయిన అతడు సాయి సుధ అనే ఆర్టిస్టుతో ఎఫైర్ సాగించడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. ఓవైపు భార్యతో గొడవలు అవుతున్నాయి. ఏదీ తేలలేదు. ఆ క్రమంలోనే సాయి సుధను పెళ్లాడతానని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడని సాయి సుధ ఆరోపించారు.
ఇకపోతే ఈ ఎపిసోడ్ లో మరిన్ని డీప్ మ్యాటర్స్ ని చెప్పి షాకిచ్చింది సాయి సుధ. బాడీగార్డ్- షాడో వంటి చిత్రాల్లో నటించేప్పుడు శ్యామ్.కే నాయుడితో పరిచయం అయ్యిందని ఆ క్రమంలోనే అతడు ప్రోపోజ్ చేయడంతో వెంటనే ఓకే చెప్పానని సాయి సుధ వెల్లడించారు. ఆ క్రమంలోనే ప్రేమ వ్యామోహంలో అతడు అడిగినంతా డబ్బు ఇచ్చానని ఆర్థికంగా తాను చాలా నష్టపోయానని సాయి సుధ వెల్లడించారు. శారీరక బంధానికి వెళ కట్టను. డబ్బు అడగను. అతడిని నిజాయితీగా ప్రేమించాను. పెళ్లాడాలనుకోవడం వల్లనే ఇప్పుడు కేసు పెట్టాను! అని చెబుతున్నారు. అతడి వల్ల మానసికంగా ఆర్థికంగా ఫిజికల్ గా చాలా నష్టపోయానని వెల్లడించారు. శ్యామ్ కేకు భార్యతో గొడవ ఎప్పటికీ తీరనిది అని తెలిసింది. అందుకే ఇప్పుడు నాకు జరిగిన ఆర్థిక నష్టాన్ని అతడు పూడ్చాలని కోరుకుంటున్నానని సాయి సుధ చెబుతోంది. ప్రేమలో పడే ముందే అతడి క్యారెక్టర్ ఏమిటో తెలుసుకోకపోవడం నా తప్పేనని ఆమె అంగీకరించారు మరి. అయితే పెళ్లయిన వాడితో ప్రేమలో పడడం అన్నది మ్యాటరే కాదని అనడం కొసమెరుపు.