ఎమ్మల్యేగా పోటీ చేస్తున్న హీరోయిన్ మాధవీలత

ఇతర భాషల భామలు టాలీవుడ్ ని ఏలుతున్న రోజుల్లో తెరంగ్రేటం చేసిన తెలుగు అమ్మాయి మాధవిలత. తొలి చిత్రం నచ్చావులే బాగానే ఆడినా ఆ తర్వాత ఆమె కెరీర్ అనుకున్న స్దాయిలో ముందుకు వెళ్లలేదు. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. రీసెంట్ గా తను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి చెప్పి వార్తల్లో నిలించింది ఈ గుమ్మ.

అంతేకాదు ఈ మధ్యే ఆమె రాజకీయ అరంగేట్రం కూడా చేసింది. భారతీయ జనతా పార్టీలో చేరి తరచుగా ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిలో పడుతోంది. తాజాగా మాధవీలత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో పోటీకి దిగారు.

కొన్నినెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాధవీలత.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. గుంటూరు వెస్ట్ నుంచి ఆమె బరిలో దిగారు. తనకు బీజేపీ టికెట్ కేటాయించడంతో సంతోషాన్ని వ్యక్తంచేశారు. పార్టీతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరోమారు నమో సర్కారే రావాలని కోరారు. అంతకుముందు నుంచే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టూరేశారు. ఓటర్లను కలుస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరారు. మాధవీ లత పోటీ ఇతర పార్టీల అభ్యర్థులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.