బండ బూతులు తిట్టిన శ్వేతారెడ్డి

నాగార్జునకు సామాజిక బాధ్యత లేదా..? అమల జంతువుల కోసం స్పందిస్తున్నప్పుడు ఇంత మంది అమ్మాయిలు ఆరోపణలపై ఎందుకు స్పందించరు?. టాస్క్‌ల పేరిట కంటెస్టెంట్‌లను మానసికంగా హింసిస్తున్నారు. అమల, సమంతను దమ్ముంటే బిగ్‌బాస్‌షోకు పంపించండి. ‘మన్మథుడు -2’ ప్రమోషన్స్‌కు చూపిస్తున్న‌ ఇంట్రెస్ట్.. మా ఆరోపణలపై ఎందుకు స్పందించట్లేదు. మా ఉద్యమాన్ని నీటి బుడగ అనడం విడ్డూరం. మేం కాదు గాలి బుడగలం.. ఓయూ (ఉస్మానియా యూనివర్శిటి) విద్యార్థులకు నాగార్జుననే ఓ గాలి బుడగ. నాగార్జున ఒక రోజు మీ భార్య అమలను కోడలు సమంతను బిగ్‌బాస్ హౌస్‌లో వుంచి డబ్బులు సంపాదించండి. నాగార్జున తప్పుచేయకుంటే బయటికి వచ్చి స్పందించాలి. నాగార్జున ఎందుకు దొంగలాగా దాక్కుంటున్నారు. హౌస్‌లో అందరిని జంతువులుగా బంధించి హింసిస్తున్నారు. మేము బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తాం. నాగార్జున నువ్వు ఒక ***** నువ్వు డబ్బులకు ఏమైనా చేస్తావా..?. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా నాగార్జున” అని శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.