ఆకాశం నీ హ‌ద్దుగా .. బేబీతో సూర్య కెమిస్ట్రీ కేక‌లే

మైమ‌రిపించే మెలోడీ `కాటుకా కనులే`

చాలా రేర్ గా మాత్ర‌మే కొన్ని పాట‌లు హృద‌యాల్ని హ‌త్తుకుంటాయి. అలాంటి కోవ‌కే చెందుతుంది ఈ పాట‌. సూర్య క‌థానాయ‌కుడిగా సుధ కొంగ‌ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` తాజా సింగిల్ `కాటుక క‌నులే ..` ఎంతో మెలోడియ‌స్ గా రంజింప‌జేస్తుంది.

నిమిషం నిడివితో ఉన్న వీడియో పాట ప్ర‌స్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ముఖ్యంగా జీవీ ప్ర‌కాష్ కుమార్ ట్యూన్ హైలైట్. సూర్య – అపర్ణ బాలమురళి జంట రొమాన్స్ అంతే మైమ‌రిపిస్తోంది. బేక‌రీ బేబీతో వెంట‌ప‌డే ఆక‌తాయి కుర్రాడిగా సూర్య మెస్మ‌రైజింగ్ లుక్ ఆక‌ట్టుకుంది. ఇక సూర్య శివ‌కుమార్ ట్రేడ్ మార్్క ఎక్స్ ప్రెష‌న్స్ కి అయితే కొద‌వే లేదు.

త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఇది ఓటీటీలో వ‌స్తుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైనా దానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఏదీ లేదు. మోహన్ బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరుణస్ తదితరులు తారాగ‌ణం. నిజ జీవితంలో గొప్ప‌గా ఎదిగిన ఒక రియ‌ల్ బిజినెస్ మేన్ స్ఫూర్తితో తెర‌కెక్కిన ఇన్ స్ప‌యిరింగ్ చిత్ర‌మిది. సూరియా 2 డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Aakaasam Nee Haddhu Ra - Kaatuka Kanule Video Promo | Suriya, Aparna | G.V. Prakash | Sudha Kongara