ద‌గ్గుబాటి వెడ్డింగ్ ఆల్బ‌మ్ కే వెరీ స్పెష‌ల్ ఫోటో

Rana's fiancee Miheeka displays her wedding jootis

యంగ్ హీరో రానా నేటితో బ్యాచిల‌ర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సంసార సాగ‌రంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాదీ జువెల‌రీ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మిహీక బ‌జాజ్ ని పెళ్లాడేస్తున్నాడు. వివాహానికి పూర్వ వేడుకలతో రామానాయుడు స్టూడియోస్ లో ఒక‌టే సంద‌డి నెల‌కొంది. గ‌త మూడు రోజులుగా ఈ సంబ‌రాలు పీక్స్ కి చేరుకున్నాయి. లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ ని రానా దగ్గుబాటి ఆస్వాధిస్తున్నారు. అతను మిహీకా నివాసంలో అదిరిపోయే మ‌స్తీ సాంగ్ కి నృత్యం చేసాడ‌ట‌.

నేడు రానా- మిహీక పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌రుగుతోంది. మహమ్మారి నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వేడుకల్ని నిర్వ‌హిస్తున్నారు. ఇక ఈ వేడుక‌లో రానా ఇతరులతో కలిసి డ్యాన్స్ చేసిన‌ప్పుడు మాస్క్ ని ధ‌రించిన సంగ‌తి తెలిసిందే.

రానా- మిహీక ఈ ఏడాది మేలో ప్రేమలో ఉన్న విష‌యం బ‌య‌ట‌పెట్టారు. రోకా వేడుక అదే నెలలో జరిగింది. ఆ త‌ర్వాత త‌తంగం తెలిసిన‌దే. ఎట్ట‌కేల‌కు భ‌ళ్లాల‌దేవుడు ఓ ఇంటివాడైన‌ట్టే. ఈ వేదిక నుంచి తాజాగా డాడీ సురేష్ బాబు.. బాబాయ్ విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి రానా ఇచ్చిన ఫోజు ఒక‌టి రివీలైంది. ఈ ఫోటో పెళ్లి ఆల్బ‌మ్ కే వెరీ స్పెష‌ల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.