ఆ స్టార్ హీరో పబ్లిక్ టాయిలెట్‌ లాగా వాడుకున్నాడు : శ్రీరెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి, గత కొద్ది నెలలగా తమిళ సినీ ఇండస్ట్రీలో చిచ్చు రేపింది. తమిళ్ లీక్స్ పేరుతో శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు తమిళ చిత్ర పరిశ్రమలో పెను భూకంపమే క్రియేట్ చేస్తున్నాయి. మురగదాస్, శ్రీరామ్, రాఘవ లారెన్స్, సందీప్ కిషన్, సుందర్. సి… ఇలా ఇండస్ట్రీలో పేరున్న వారిపైనే ఆరోపణలు చేసారు శ్రీరెడ్డి. ఇప్పుడు ఆమె తనను ఓ తమిళ స్టార్ ..తన జీవితాన్ని నాశనం చేయబోతున్నారంటూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టింది. ఇక్కడ మీరు ఆమె పోస్ట్ ని చూడవచ్చు.

 నన్ను పబ్లిక్ టాయిలెట్ లాగా ఉపయోగించుకున్నారు. ఆ గాయాలు ఇప్పట్లో మానడం సాధ్యం కాదు. మానసికంగా చాలా వేదన అనుభవించా అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్‌గా స్పందించింది. తమిళ చిత్ర పరిశ్రమలో నాకు అవకాశాలు వస్తున్నాయి తెలుసు. కానీ నేను నటించాల్సిన సినిమాల్లో నా శవం పాల్గొనేలా ఉంది పరిస్థితి అంటూ హాట్ కామెంట్స్ చేసింది. వాస్తవాలు మాట్లాడడం వల్లే నేను ఇలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కొనడానికి కారణం.. వాస్తవాలు బయటకు వెల్లడించడమే. దాని ఫలితంగానే భయాన్ని కలిగించే సంఘటనలు ఎదురవుతున్నాయి.

వీటి నుంచి నేను ఎలా బయట పడాలి అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జరుగుతున్న సంఘటనలు నా జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపించేలా ఉన్నాయి అని పేర్కొంది. తమిళ హీరో ఓ తమిళ హీరో నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాపై వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. ఆ హీరో తెలుగువారికి కూడా బాగా పరిచయం అని శ్రీరెడ్డి పేర్కొంది. అతడు భంకరమైన వుమెనైజర్ అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను ప్రశాంతంగా జీవించే పరిస్థితి కనిపించడం లేదు. బ్రతకాలా వద్దా అంటూ చాలా ఎమోషనల్‌గా, సంచలనాత్మక పోస్ట్ పెట్టింది.

 

 

ఇక ఆ మధ్య సినిమా అవకాశం ఇస్తానని చెప్పి నన్ను శారీరకంగా వాడుకున్నాడని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. లారెన్స్‌ని తాను కలిసినప్పుడు తన ప్రైవేట్ భాగాలని ముట్టుకున్నాడని శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించింది. మంచి తనం ముసుగులో లారెన్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని శ్రీరెడ్డి గతంలో ఆరోపించింది.

శ్రీరెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని రాఘవ లారెన్స్ కొట్టిపారేశాడు. అయితే ఆ తర్వాత లారెన్సే అవకాశం ఇచ్చాడట. లారెన్స్ నిర్మించబోతున్న ఓ సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీరెడ్డి స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఇంత రచ్చ చేసి శ్రీరెడ్డి ప్రస్తుతం లారెన్స్ సినిమాలోనే అవకాశం కొట్టేయడంపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.