పాలు పితకటం నేర్చుకున్న బాలయ్య

(ఇది 25 సంవత్సరాలనాటి సంగతి )

జగపతి రాజేంద్ర ప్రసాద్ కు నిర్మాతగా  దర్శకుడుగా మంచి పేరుంది. ఆయన్ని అందరు గౌరవిస్తారు, నిర్మాణంలో రాజీ పడరు.  నటీనటులను సాంకేతిక నిపుణులను బాగా చూస్తాడు.

1993వ సంవత్సరంలో ఆయన హైదరాబాద్ కు మకాం మార్చిన తరువాత  రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “బంగారు బుల్లోడు ” అనే సినిమా నిర్మించాలనుకున్నాడు. బాలకృష్ణ, రమ్య కృష్ణ, రవీనా టాండన్  ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో తియ్యాలి, అందుకు ఆంధ్ర వెళ్లి పూడిపల్లి అనే గ్రామం  చూసి బాగుందనుకున్నారు.షూటింగ్ కు, ఉండటానికీ వీలుగా నాలుగు బెడ్ రూముల  ఇల్లు నిర్మించారు.ఆర్ట్ డైరెక్టర్ చంటి పర్యవేక్షణలో  ఇది తయారయ్యింది

ఇక అక్కడ షూటింగ్ మొదలు పెట్టారు . ఒక వారం రోజుల తరువాత హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానించారు .

ఆరోజు మేము వెళ్ళేటప్పటికి నది ఒడ్డున ఉన్న ఇంట్లో షూటింగ్ చేస్తున్నారు. బాలకృష్ణ, రమ్య కృష్ణ , రవీనా మొదలైన వారు వున్నారు . కాసేపటికే ఓ రైతు వచ్చి “గేదెలను  తీసుకొచ్చాను” అన్నాడు

“చుద్దాం  రండి” అంటూ నన్ను కూడా పిలిచాడు

బయట చెట్టు దగ్గర గేదెలు కట్టేసి వున్నాయి .

“పాలిచ్చే గేదెలేగా ” అడిగాడు రైతుని .

“అవును సార్  ఇవ్వాళ పాలు తియ్యలేదు ” చెప్పాడు .

ఒక గంట తరువాత డైరెక్టర్ రవిరాజా, బాలకృష్ణ  అక్కడికి వచ్చారు .

బాలకృష్ణకు , రవీనా కు  సీన్ వివరించాడు . అయితే రవీనా మాత్రం గేదె దగ్గరకు వెళ్లనంది.

అప్పుడు బాలకృష్ణ ఆమెలో వున్న భయం పోగొట్టాడు.

ముందు ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేశారు. రిహార్సల్  సమయంలో దర్శకుడు రవిరాజా, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గేదె పక్కన కూర్చుని  రవీనా లోని భయాన్ని పూర్తిగా పోగొట్టారు.

ఆ తరువాత గేదె దగ్గర బాలకృష్ణ పాలు పిండుతూ ఉంటాడు.

రవీనా వచ్చి గేదె దగ్గర కూర్చొని “నీ పేరేమిటి “అంటుంది

“నా  పేరు బాలయ్య అంటారు తెసినవారు, బయటివాళ్ళు బాలకృష్ణ అని పిలుస్తారు., మరి నీ పేరో ?”

“ప్రియ .. సుప్రియ .”అని  వెళ్ళిపోతుంది .

రెండు మూడు టేకుల తరువాత ఒకే అయ్యింది .

మీరు చూస్తున్న ఫోటో అప్పటిదే .

-భగీరథ