“గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్.. ఓ గుడ్ న్యూస్, ఓ బాడ్ న్యూస్ మీకోసం..!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లు నటించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. మలయాళ హిట్ సినిమాకి రీమేక్ గా చేసిన ఈ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతుంది.

ఇక సినిమా రిలీజ్ కి ఎన్నో రోజులు కూడా లేవు దీనితో అప్డేట్స్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో ఇప్పుడు నడుస్తున్నాయి. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రేపే స్టార్ట్ కానుంది. అయితే ఈ ఈవెంట్ పై అయితే రెండు వార్తలు ఇపుడు తెలుస్తున్నాయి.

ఒకటి గుడ్ న్యూస్ కాగా మరొకటి అయితే బాడ్ న్యూస్ అనే తెలుస్తుంది. ముందు బాడ్ న్యూస్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వస్తారు అనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే రావట్లేదట. అందుకు ఛాన్స్ లు చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తుంది.

ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాపై క్రేజీ ట్రైలర్ ని అయితే ఈ ఈవెంట్ లోనే రిలీజ్ చేస్తారని కన్ఫర్మ్ అయ్యింది. అంటే రేపే గడ్ ఫాదర్ ట్రైలర్ రోజు అనమాట. దీనితో అయితే అభిమానులకి రేపు మరో పండగే అని చెప్పాలి. ఇలా ఈ రెండు వార్తలు ఇప్పుడు ఈ సినిమాపై తెలుస్తున్నాయి.