2.0 మూవీ రిలీజ్ డేట్ ఫైనల్ చేసిన డైరెక్టర్ శంకర్

ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న 2.0 మూవీ విడుదల తేదీ ఖరారైంది. రజినీకాంత్, అక్షయ కుమార్, అమీ జాక్సన్ వంటి ప్రముఖ నటులతో చిత్రీకరించబడిన ఈ సినిమా పోయిన సంవత్సరమే విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. దీంతో ఇటు తలైవా అభిమానులు, అక్షయ్ కుమార్ అభిమానులు 2.0 ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా విడుదలకు సంబంధించి పలుమార్లు వివిధ తేదీలు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఆ సినిమా యూనిట్ మాత్రం వాటిని అధికారికంగా ధ్రువీకరించలేదు. తాజాగా ఈ మూవీ దర్శకుడు శంకర్ రిలీజ్ డేటును తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియపరిచారు. ‘ఎట్టకేలకు వీఎఫ్ఎక్స్‌ కంపెనీలు వీఎఫ్ఎక్స్‌ షాట్స్ ఎప్పుడు డెలివరీ చేయనున్నాయో ఖరారు చేశాయి. ఈ సినిమాను 2018 నవంబరు 29 న రిలీజ్ చేయనున్నాము’ అని పోస్టు పెట్టారు.

https://platform.twitter.com/widgets.js