‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లో త్రిష సరసన కనిపించిన మరో హీరోయిన్ అర్చన. ఆమెకు అందం ఉన్నా సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక హెల్త్ కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్ తో ఆమె నిశ్చితార్ధం నిన్న బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లో జరిగింది.
ఈ వేడుకకు కొద్దీ మంది ప్రముఖులు మాత్రమే విచ్చేసారు. సాయి బాలాజీ, మధుమిత, సుమంత్, నవదీప్ మొదలైన వారు వేడుకకు విచ్చేసారు.ప్రస్తుతం ఆమె కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.