హాట్ ఐట‌మ్ నంబ‌ర్‌గా మారిపోయింది!

హెబ్బా ప‌టేల్ క్రేజ్ త‌గ్గిపోతోంది. అవ‌కాశాలు కూడా పెద్ద‌గా రావ‌డం లేదు. దీంతో త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ప‌డింది. ఇటీవ‌ల క్రిష్ `ఆహా` కోసం చేసిన `మ‌స్తీస్‌` వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయి న‌టించిన హెబ్బా తాజాగా హీరో రామ్ కోసం హాట్ ఐట‌మ్ పాప‌గా మారికపోయింది.
`ఇస్మార్ట్ శంక‌ర్‌` హిట్ త‌రువాత రామ్ న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌లి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు.

త‌మిళ హిట్ `త‌డ‌మ్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఈ చిత్రం కోసం ఓ ఐట‌మ్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. ఈ పాట కోసం హెబ్బా ప‌టేల్ తీసుకున్నారు. స్ర‌స్తుతం రామ్ తో పాటు హెబ్బా ప‌టేల్ పాల్గొన‌గా డ్యాన్స్ మాస్ట‌ర్ జానీ ఈ పాట‌ని రూపొందిస్తున్నాడు. ఈ పాట సినిమాలో హైలైట్ కానుంద‌ట‌. ఈ పాట‌లో హెబ్బా మ‌రింత హాటుగా క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నారు.