హంస‌పై మ‌ళ్లీ మ‌న‌సుపారేసుకున్నాడు?

జ‌క్క‌న్న రాజ‌మౌళి మ‌ళ్లీ హాటీ లేడీ హంసా నందినిపై మ‌న‌సు పారేసుకున్న‌ట్టున్నాడు. గ‌తంలో `ఈగ‌` సినిమా కోసం హంసా న‌దినికి ఛాన్స్ ఇచ్చిన రాజ‌మౌళి మ‌రోసారి ఆమెకు ఈ డెకేడ్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా హంసా నందినికి స్పెష‌ల్ గీతాలే పేరుని తెచ్చిపెట్టాయి. `మిర్చి`, లౌక్యం, సోగ్గాడే చిన్నినాయ‌నా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, జై ల‌వ‌కుశ‌, పంతం వంటి చిత్రాల్లోని ప్ర‌త్యేక గీతాల్లో మెరిసింది. గ‌త కొంత కాలంగా స‌రైన అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో విహార యాత్ర‌లు చేస్తోంది.

గ‌త రెండేళ్లుగా ఖాలీగా వుంటున్న హంస‌కు రాజ‌మౌళి ఇచ్చిన అవ‌కాశం ఓ పండ‌గే అంటున్నారు. అయితే ఇందులో హంస‌ది చిన్న పాత్రే అని రాజ‌మౌళి అడ‌గ‌డంతో ఎగిరి గంతేసి ట‌క్కున ఒప్పేసుకుంద‌ని, హంస‌ది సినిమాలో చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపుని తెచ్చిపెడుతుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. భారీ హంగుల‌తో రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని ముందు అనుకున్న జూలైలో కాకుండా సంక్రాంతి బ‌రిలో 2021 జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు.