అల్లు అరవింద్ సమర్పించు బస్తి బాలరాజు

న్యూ జోన‌ర్ సినిమాల‌కే ప్రేక్ష‌కులు ఈ మ‌ధ్య ప‌ట్టం క‌ట్ట‌డం మొద‌లుపెట్టారు. దీంతో తెలుగు సినిమా మేకింగ్‌, టేకింగ్ వాస్త‌వికత‌కు అద్దంప‌డుతోంది. అలా తెర‌కెక్కిన చిత్రాల్నే ప్రేక్ష‌కులు అత్య‌ధికంగా ఇష్ట‌ప‌డుతుండ‌టంతో ఆ త‌ర‌హా చిత్రాల్లోనే క‌నిపించ‌డానికి యంగ్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. `RX100` సినిమాతో షాకింగ్ హిట్‌ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ మ‌ళ్లీ అదే త‌ర‌హా నేచుర‌ల్ స్టోరీతో చేస్తున్న చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. అల్లు అర‌వింద్ స‌మ‌ర్స‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

`గుణ 369` ట్రైల‌ర్ లాంచ్‌లో స‌ర‌దాగా మా బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేసే అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పిన అల్లు అర‌వింద్ ఇచ్చిన మాట ప్ర‌కారం కార్తికేయ గుమ్మ‌కొండ‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌మా క‌థా, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గురువారం మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

`గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పోస్ట‌ర్‌లో నేను వుండ‌టం ఇది క‌ల కాదు నిజ‌మే. గ‌ర్వంగా చెప్పుకునే బ‌స్తీబాల‌రాజు పాత్ర‌ని నాచేత చేయిస్తున్న కౌశిక్‌కి థాంక్స్ అనే ప‌దం చిన్న‌మాట‌. బ‌స్తీబాల‌రాజు పాత్ర‌తో అంతా ల‌వ్‌లో ప‌డ‌తారు. ఎల్ల‌ప్పుడూ మీ ప్రేమ‌ను కోరుకునే..` అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో కార్తికేయ స్వ‌ర్గ‌పురి వాహ‌నాన్ని (శ‌వాల‌ని స్మ‌శానానికి త‌ర‌లించే వాహ‌నం) డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ ఈ రోజు నుంచే మొద‌లైంది.