స్పోర్ట్స్ డ్రామాలో ఆది పినిశెట్టి

తెలుగు నాట ఆది పినిశెట్టి బాగానే పేరు సంపాదించుకున్నాడు. ‘నిన్ను కోరి’, ‘సరైనోడు’ సినిమాల్లో నటుడిగా, ప్రతినాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ పైన పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇతను తమిళ నాట హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘క్లాప్’. ఇందులో అతనికి జోడీగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తోంది.

ఈ చిత్రానికి పృథ్వి ఆదిత్య దర్శకత్వం చేస్తుండగా బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వాన్త్ రామ్ క్రియేషన్స్ మరియు షిరిడి సాయి మూవీ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ మొదలైన వారు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం హైదరాబాద్లో ఒక పాట చిత్రీకరణ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది.