సౌత్‌పై కన్నేసిన సల్మాన్

తెలుగు సినిమాల పై ప్రపంచం దృష్టి సారిస్తున్న వేళ తెలుగు సినిమా బాలీవుడ్‌లోనూ బావుటా ఎగరేస్తున్న సమయమిది. ఇలాంటి పరిస్థితిలో దక్షిణాదిన అందులోనూ తెలుగు మార్కెట్‌లో వాటా కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ పావులు కదుపుతున్నాడు.

ముఖ్యంగా హిందీ తర్వాత పెద్ద మార్కెట్‌గా విస్తరిస్తోన్న తెలుగుపైనే దృష్టి పెడుతున్నాడని వార్త. అందులో భాగంగానే తన దబాంగ్ 3 సినిమాను తెలుగు సహా తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తున్నఈ దబాంగ్ 3ని సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుందని సమాచారం.