‘సైరా’ కోసం మళ్లీ పవన్ !కన్ఫర్మ్ చేసిన రామ్ చరణ్

‘సైరా’ కోసం పవన్ మళ్లీ కష్టపడ్డాడు

ఆ మధ్యన రిలీజైన సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ వాయిస్ ఓవర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అంత కష్టపడి ఇచ్చిన వాయిస్ కేవలం టీజర్ కు మాత్రమే పరిమితమా అంటే కాదని తెలుస్తోంది. సైరా సినిమాలోనూ పవన్ వాయిస్ వినిపించబోతోందని సమాచారం. ఈ మేరకు నిర్మాత రామ్ చరణ్ ఖరారు చేసారు.

నిన్న సైరా ట్రైలర్ విడుదల నేపథ్యంలో నిన్న నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పుడే మీడియా వారు అడిగిన పలు ఇంట్రస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ ఇంటరాక్షన్ లో భాగంగా ఒకరు సైరా టీజర్ లో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఓవర్ ఉంది కదా, మరి మూవీలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా అని అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా రామ్ చరణ్ చెప్పచ్చా లేదా అని సందేహిస్తూనే అవునని సమాధానం చెప్పడం జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ సైరా మూవీ లో కూడా ఉంటుందన్న విషయం బయిటకు వచ్చింది. అయితే మరోసారి పవన్ వాయిస్ ఓవర్ చెప్పారా లేక అప్పటి వాయిస్ నే వాడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో వచ్చే నెల 2న విడుదలవుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం పై భారీ అంచనాలున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది.