‘సైరా’ఒరిజనల్ బడ్జెట్, అందులో చిరు రెమ్యునేషన్

‘సైరా నరసింహారెడ్డి’కు చిరుకు ఎంత ఇచ్చారు

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘సైరా నరసింహారెడ్డి’.ఈ సినిమా కోసం ఓ ప్రక్క మెగా ఫ్యాన్స్ మరో ప్రక్క సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా కు బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు, చిరంజీవికు ఎంత ఇచ్చారు అనేది హాట్ టాపిక్ మారింది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 270 కోట్ల భారీ బడ్జెట్‌ తో రామ్ చరణ్ నిర్మించారు. అలాగే ఈ బడ్జెట్ లో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం 40 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆయన తన రెమ్యునేషన్ ఏమీ తీసుకోలేదట. మెగాస్టార్ కి హోమ్ ప్రొడక్షన్ కాబట్టి, ఆయన లాభాలలో షేర్ ను తీసుకుంటారట. ఇక ఈ చిత్రం తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద చిత్రంగా రాబోతుంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.