కన్నడ నటుడు సుషీల్ గౌడ ఆకస్మికంగా తన జీవితాన్ని చాలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 30 వయసులో ఈ యువహీరో ఆత్మహత్య చేసుకుని ప్రాణాల్ని అర్పించడంపై కన్నడ పరిశ్రమలో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఉదయ్ కిరణ్ (34).. సుశాంత్ సింగ్ (33) తరహాలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడంపై అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
అరవిద్ కౌశిక్ దర్శకత్వం వహించిన అంతపురా అనే సీరియల్‌లో సుశీల్ గౌడ నటించారు. ప్రముఖ టీవీ నటుడిగా అతడు సుపరిచితం. ఈ వర్థమాన నటుడి మరణంపై దర్శకుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దునియా విజయ్ రాబోయే చిత్రం సలాగా లో కూడా సుశీల్ నటించారు. ఈ చిత్రంలో అతను ఒక పోలీసు పాత్రను పోషించాడు. భవిష్యత్తులో సుశీల్ కి పెద్ద స్టార్ అయ్యే అవకాశం ఉంది. హీరో మెటీరియల్ అన్న టాక్ కూడా ఉంది. జీవితంలో అన్ని సమస్యలకు ఆత్మహత్య సమాధానం కాదని దునియా విజయం ఈ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు.
కన్నడ టీవీ పరిశ్రమ ఈ యువనటుడి మరణంతో కన్నీరుమున్నీరవుతోంది. షో బిజినెస్ ఒక జూదం అని చాలా మంది చెబుతారు. సక్సెస్ సాధిస్తే కెరీర్ కి సమస్య ఉండదు. విఫలమైతే స్టార్ల జీవితం ప్రమాదంలో పడుతుందని విశ్లేషిస్తున్నారు.