సీనియ‌ర్ యాంక‌ర్ విడాకులు అంటూ..‌!

సీనియ‌ర్ యాంక‌ర్ విడాకులు అంటూ..‌!

మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్ లో విడాకులు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ప‌లువురు స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకుని అటుపై విడాకులు తీసుకోవ‌డంపై నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇలాంటి క‌ల్చ‌ర్ బాలీవుడ్ లో కాస్త ఎక్కువే కానీ.. టాలీవుడ్ లో ఇన్నాళ్లు చాలా ప‌రిమితంగానే క‌నిపించింది. అయితే ఇటీవ‌ల నెమ్మ‌దిగా ఇక్క‌డా బాలీవుడ్ త‌ర‌హాలో వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ విస్త‌రిస్తోంద‌నేందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. విడాకులు బ్రేక‌ప్ లాంటివి ఇటీవ‌ల రెగ్యుల‌ర్ గా వినిపిస్తున్నాయ్.

ఇక టాలీవుడ్ లో ఓ సీనియ‌ర్ యాంక‌ర్ త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోనున్నార‌ని కొంత‌కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. భ‌ర్త‌తో పొస‌గ లేదు. అయినా ఇంట్లో పెద్దాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని క‌లిసి ఉన్నార‌ని చెబుతున్నారు. అయితే ఇటీవ‌ల అనూహ్యంగా పెద్ద దిక్కును కోల్పోయాక మాత్రం ఎవ‌రికి వారు విడిగానే ఉంటున్నార‌ట‌. అయితే ఈ విడాకులు తంతును ఏమాత్రం గొడ‌వ‌ల్లేకుండా ఫ్రెండ్లీగానే సాగించాల‌ని భావిస్తున్నార‌ట‌. అలాగే పిల్ల‌ల్ని విదేశాల్లో చ‌దివించేందుకు ప్లాన్ ఉందని చెప్పుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇలా విడిపోవ‌డం బాధాక‌ర‌మే. కానీ క‌ల‌త‌ల‌తో క‌లిసి ఉండే కంటే విడిపోవ‌డానికే సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఇలాంటిది విన‌డం.. స‌ద‌రు యాంక‌ర్ ఫ్యాన్స్ కి ఇబ్బందిక‌ర‌మే. ప్ర‌ముఖ మీడియాల్లో ఈ త‌ర‌హా గాసిప్పులు ప్ర‌చారం అవ్వ‌డం చూస్తుంటే విష‌యం సీరియ‌స్ అనే భావించాల్సి వ‌స్తోంది.