సిత్త‌రాల సిర‌ప‌డు.. సిత్త‌రాల సిర‌ప‌డు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` బాక్సాఫీస్ ని బొంబాట్‌ ఆడేస్తోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఊహ‌కంద‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బ‌న్నీ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌బోతోంది. ఇందుకు సినిమాలోని స‌న్నివేశాలు, బ‌న్నీ స్టైల్సే ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తున్నాయి.

బ్ర‌హ్మాజీతో హోట‌ల్‌లో మీటింగ్ సంద‌ర్భంగా వ‌చ్చే ఫైట‌ట్‌తో పాటు త‌మ‌న్ అందించిన పాట‌లు, భావోద్వేగ స‌న్నివేశాలు, బ‌న్నీ, పూజాహేగ్డే మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, ఫాద‌ర్ అండ్ స‌న్ సెంటిమెంట్‌ సినిమాని మ‌రో హైట్స్‌కి తీసుకెళ్లాయి. అయితే ఇవ‌న్నీ ఒకెత్త‌యితే క్లైమాక్స్‌లో వ‌చ్చే ఊర మాస్ స్టైలిష్ ఫైట్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఓ కాన్సెప్ట్ ప్ర‌కారం పాట‌లో ఫైట్‌ ని మిక్స్ చేసి డిజైన్ చేసిన తీరు ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయిస్తోంది. `సిత్త‌రాల సిల‌ప‌డు.. సిత్త‌రాల సిల‌స‌డు.. అంటూ సాగే ఈ పాట‌లో బ‌న్నీ స్టైల్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. పాట పాడుతూ ఫైట‌ట్ య‌మ స్టైల్‌గా ఫైట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇంట‌ర్నెట్‌ని కుమ్మేస్తోంది.