సాయిధ‌ర‌మ్‌కు ఇక ప్ర‌తి ఏడాదీ పండ‌గే!

వ‌రుస‌గా ఆరు ఫ్లాప్‌ల త‌రువాత కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన `చిత్ర‌ల‌హ‌రి`తో సాయిధ‌రమ్‌తేజ్ కెరీర్ మ‌ళ్లీ ఊపందుకుంది. ఈ సినిమా త‌రువాత మారుతితో చేసిన `ప్ర‌తిరోజు పండ‌గే` అనూహ్య విజ‌యాన్ని సాధించి సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే భారీ వసూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఇక్క‌డి నుంచి ఈ మెగా మేన‌ల్లుడికి ప్ర‌తి రోజు కాదు ప్ర‌తీ ఏడాది పండ‌గే అన్న‌ట్టుగా మార‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

దీనికి తాజాగా సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇస్మార్ట్ పోరి న‌భా న‌టేష్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. టీజ‌ర్ నుంచే ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిట‌ల్ హ‌క్కుల రూపంలో 10 ప‌లికి న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భారీ మొత్తానికి జీటీవి శాటిలైట్ హ‌క్కుల్ని సొంతం చేసుకుంద‌ట‌. సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే త‌ను న‌టించిన ఏ చిత్రానికి ఇంత భారీ మొత్తంలో శాటీలైట్ హ‌క్కుల రూపంలో రావ‌డం ఇదే ప్ర‌ధ‌మం కావ‌డంతో సినిమాపై ఏ రేంజ్‌లో హైప్ వుందో అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయ‌బోతున్నారు.