మెగాస్టార్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వానికి గుడ్ బై

స్టార్ డైరెక్ట‌ర్ ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నారా?.. అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వున్న‌ట్టుండి ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల‌నుకుంటున్న ద‌ర్శ‌కుడు మరెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. త‌న మేన మామ పోసాని కృష్ణ‌ముర‌ళి ద‌గ్గ‌ర అస్టెంట్ రైట‌ర్‌గా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించి `గ‌ర్ల్‌ఫ్రెండ్` సినిమాతో కో రైట‌ర్‌గా, `భ‌ద్ర‌` సినిమాతో సోలో రైట‌ర్గా మారిన కొర‌టాల `ఊస‌ర‌వెల్లి` వ‌ర‌కు రైట‌ర్‌గా ప‌నిచేశారు.

ప్ర‌భాస్ న‌టించిన `మిర్చి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న జ‌ర్నీ మొద‌లుపెట్టారు. ఏడేళ్ల ప్ర‌యాణంలో 2013 టు 2020 వ‌ర‌కు మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను చిత్రాల్ని కూపొందించారు. తాజాగా చిరుతో భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కొర‌టాలకు ఐద‌వ సినిమా. ఒక సంద‌ర్భంలో ప‌ది సినిమాలు పూర్త‌యిన త‌రువాత ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్పేస్తాన‌ని కొర‌టాల ప్ర‌క‌టించాడు. అయితే ప‌ది చిత్రాల్ని పూర్తి చేయ‌కుండానే కొర‌టాల ఇండ‌స్ట్రీకి గుడ్‌బై చెప్పాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు నిర్మాత‌ల‌ల్లో వినిపిస్తోంది.

ప‌ది చిత్రాలు పూర్తి చేసిన త‌రువాత గుడ్ బై చెప్పాల‌నుకున్న కొర‌టాల ఉన్న‌ట్టుండి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డానికి కార‌ణం ఎవ‌రు?.. ఎందుకు ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకోబోతున్నారు? అన్న‌ది మాత్రం ఇండ‌స్ట్రీలో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ట‌. అయితే ఇన్ సైడ్ టాక్ మాత్రం చిరు మెడ‌పై క‌త్తిపెట్టినట్టుగా 99 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాల‌నే కండీష‌న్‌ని `స‌రిలేరు.. ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా పెట్ట‌డంతో కొర‌టాల కొంత అస‌హ‌నానికి గుర‌య్యాడ‌ని, ఆ కార‌ణంగానే త్వ‌ర‌గానే ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పాల‌నే నిర్ణ‌యానికి కొర‌టాల వ‌చ్చిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.