శ‌ర్వాకు షాకిస్తున్న ప్రొడ్యూస‌ర్స్‌?

ఇండ‌స్ట్రీలో ఎంత టాలెంట్ వున్నా హిట్ వుంటేనే ఆ టాలెంట్‌కు విలువ‌. అది లేక‌పోతే ఈ రోజు పిలిచిన వాడు రేపు పిల‌వక‌పోవ‌డం ఇక్కడ ష‌రా మామూలే. ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితిని హీరో శ‌ర్వానంద్ ఎదుర్కొంటున్నాడు. దానికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న‌ నటించిన చిత్రాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డ‌మే. పడి ప‌డి లేచే మ‌న‌సు, ర‌ణ‌రంగం, తాజాగా జాను…ఇలా వ‌రుస‌గా మూడు ఫ్లాప్‌లు వ‌చ్చాయి.

దీంతో శ‌ర్వానంద్‌తో సినిమాలు చేయాల‌ని ఇంత కాలంగా ఎదురుచూసిన నిర్మాత‌లంతా మ‌న‌సు మార్చుకుని మ‌రో హీరోని వెతుక్కుంటున్నార‌ట‌. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్‌కు గురైన శ‌ర్వా విశ్రాంతి కోసం యుఎస్ వెళ్లిన‌ట్టు తెలిసింది. కొన్ని రోజులు అక్క‌డే గ‌డిపి తిరిగి ఇండియా రాబోతున్నాడ‌ట‌. శ‌ర్వా వ‌స్తేనే `శ్రీ‌కారం` షూటింగ్ మ‌ళ్లీ కంటిన్యూ అవుతుంది. అందు కోసం చిత్ర యూనిట్ వెయిట్ చేస్తున్నార‌ట‌. శ‌ర్వానంద్‌ కోసం `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి కూడా ఎదురుచూస్తున్నాడు. ఎప్పుడు శ‌ర్వా వ‌స్తే అప్పుడు `మ‌హాస‌ముద్రం` ప్రాజెక్ట్‌ని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.