శోభనను కూడా విడిచిపెట్టలేదు!

శోభనను కూడా విడిచిపెట్టలేదు!

కరోనా కారణంగా జనం అంతా ఇబ్బందులు పడుతున్న వేళ హ్యాకర్స్ ఎవ్వరు ఎలా దొరుకుతారా? వఆరిని ఎలా ఆడుకోవాలా అని పైశాచిక ఆనందాన్ని వెతుక్కుంటున్నరు. లాక్డౌన్ టైమ్లో జనం ఇళ్లకే పరిమితం అయి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పోస్ట్‌లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా భావిస్తున్న హ్యాకర్స్ వారి అకౌంట్లని తేలిగ్గా హ్యాక్ చేసేస్తున్నారు.

ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్ని హ్యాక్ చేసి అసభ్యకరమైన ఫొటోలని పోస్ట్ చేసి ఇబ్బంది పెట్టిన హ్యాకర్స్ తాజాగా వెటరన్ నటి శోభన ఫేస్ బుక్ అకౌంట్ని హ్యాక్ చేసి షాకిచ్చారట. గత కొన్నేళ్లుగా శోభన నటనకు దూరంగా వుంటూ దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్కు సంంధించిన ప్రోగ్రామ్స్ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా శోభనే వెల్లడించింది.

తన ఫేస్ బుక్ అకౌంట్ని హ్యాక్ చేశారని, సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేశానని, త్వరలోనే తన అకౌంట్ మళ్లీ యాక్టీవ్ అవుతుందని నమ్ముతున్నానని శోభన వెల్లడించారు. ఈ ఏడాదే దుల్కర్ సల్మాన్ నటించి నిర్మించిన మలయాళ చిత్రం `వారానే అవశ్యముడ్` చిత్రంలో నటించారు శోభన. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో శోభన అత్యధిక చిత్రాల్లో నటించారు. ఈ మూడు భాషల్లోనూ టాప్ హీరోలతో కలిసి నటించారామె.