శర్వా ‘శ్రీకారంలో’ కన్నడ హీరోయిన్ ఆషిక

యువ హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభం అయింది 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సాయి మాధవ్ బుర్రా మాటల రచయిత.

ఈ సినిమాలో శర్వా కు జోడీగా చాలా మంది పేర్లు వినిపించినా చివరికి కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఎంచుకున్నట్టు సమాచారం. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ, మలయాళ హీరోయిన్ల హవా పెరుగుతోంది. ఈమె కూడా అలా టాలీవుడ్ లో పాగా అవకాశం ఉండవచ్చు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.