టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతకిలపడిపోయింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ సినిమాపై రిలీజ్ వరకు ఎలాంటి బజ్ లేదు. ఇక బంతి గాల్లో వుంది సిక్సర్ అవుతుందో ఏమౌతుందో తెలియదు అంటూ ముందే విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చేయడంతో సినిమా వసూళ్ల అంతగా వుండే అవకాశం లేదని తేలిపోయింది.
తొలి రోజు డివైట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి రోజు 6 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్:
నైజాం – రూ. 2.01 కోట్లు
సీడెడ్ – రూ. 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 0.52 కోట్లు
గుంటూరు – రూ. 0.43 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
కృష్ణ – రూ. 0. 25 కోట్లు
నెల్లూరు – రూ. 0. 18 కోట్ల
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తొలి రోజు వసూళ్లు 4. 23 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్, మిగతా ఏరియాల్లో కలిపి 2.77 వసూలు చేసినట్టు చెబుతున్నారు. థియేట్రికల్ రైట్స్ 23. 81 కోట్లు. ఇప్పటి వరకు వచ్చింది. అందులో వసూళ్ల రూపంలో వచ్చింది 25 శాతం మాత్రమే. మరో 75 శాంతం వసూళ్లని రాబడితేనే బయ్యర్స్ సేఫ్ జోన్‌లోకి ఎంటరవుతారు. అది సాధ్యమౌతుందా? తేదా అన్నది ఈ శనివారం, ఆదివారం వసూళ్లతో తేలిపోతుంది.