గత ఏడాది అక్టోబర్‌లో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు, టేయ రచయిత జొన్నవిత్తులకు మధ్య మాటల వార్ నడిచిన విషయం తెలిసిందే. వర్మపై జొన్నవిత్తుల పరుశ పదాలతో మండిపడితే దానికి గట్టి కౌంటర్ ఇచ్చారు వర్మ. `నా బుజ్జి జొన్నా నీ వీడియాఓ చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడు దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ, లేదంటే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా.. నీ భార్యా పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్లమీద జాలేస్తుంది స్వీట్ హార్ట్. కానీ ఐ లవ్ యూ డా` అని వర్మ ఓరేంజ్‌లో ఆడేసుకున్నాడు.
దీంతో హర్ట్ అయిన జొన్నవిత్తుల ఏకంగా ఆర్టీవిపై సినిమానే మొదలుపెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `కార్తికేయ` నిర్మాత శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా `ఆర్టీవీ` పేరుతో ఓ సినిమాకు కశ్రీకారం చుట్టారు. కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్నారు. తొలి సారి ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు జొన్నవిత్తుల కథా, మాటలు, పాటలు, చిత్రానువాదం చేస్తున్నారు. స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు యువతను తప్పుదోవ పట్టించి అదే తమ సిద్ధాంతంలా భావిస్తూ సమాజానికి చీడపురుగుల్లా తయారైన వారి పిచ్చిని తగ్గించే ఔషధంగా ఈ చిత్రాన్ని వదులుతున్నామని జొన్నవిత్తుల ఇండైరెక్ట్‌గా వర్మపై సెటైర్లు వేశారు. మరి దీనికి వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.