వైరల్ వీడియో :బాలయ్య …ఈ కామెడీ ఏంటయ్యా

ఎయిర్ పోర్ట్ లో బాలయ్య కామెడీ..షూటింగా, సరదానా?

నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం లో వెరైటీ గెటప్ తో మీడియాలో వార్తగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ విషయం జనం మరువక ముందే మరోసారి ఆయన మీడియాకు ఎక్కారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల చల్ చేస్తోంది. ఈ వీడియో ఎంత పాపులారిటీ సాధించిందంటే జనం తెగ షేర్ చేస్తున్నారు. కొత్త సినిమా ట్రైలర్ లాగ పండగ చేసుకుంటున్నార్ ఫ్యాన్స్. ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటారా..ఇక్కడ చూడండి.

ఇక ఈ వీడియోలో బాలయ్య వైట్ కలర్ స్టైలిష్ బ్లేజర్ ధరించి ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ రావడం.. తన సూట్ కేసును దూరంగా జరపడం.. మళ్ళీ దానికి ఒక మ్యాజిక్ లాగా దగ్గరకు లాక్కోవడం.. మరోసారి అదే పని రిపీట్ చేయడం కనిపిస్తోంది. ఇదంతా కావాలని చేసిందా లేదా తన తాజా చిత్రం షూటింగ్ లో భాగంగా ఇది చేసారా అనేది మాత్రం తెలియటం లేదు.

అయితే చాలా మంది మాత్రం #NBK105 షూటింగ్ లో భాగంగా ఈ సీన్ షూటింగ్ జరిగిందని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఇదో ప్రాంక్ సీన్ కావొచ్చని అంటున్నారు. ఏదేమైనా బాలయ్య బాబు ఈ గెటప్ లో స్టైలిష్ గా ఉన్నారనేది కాదనలేని సత్యం. మిగతావంటారా..సినిమా రిలీజయ్యాక థియోటర్ లో ఆ సీన్ ఉందో లేదో చూద్దాం.