వీడు పిల్లోడు కాదు.. రౌడీపై కొర‌టాల కామెంట్స్‌!

వీడు పిల్లోడు కాదు.. రౌడీపై కొర‌టాల కామెంట్స్‌!

బీ ద రియ‌ల్ ‌మెన్ ఛాలెంజ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కార‌ణంగా కొత్త పుంత‌లు తొక్క‌డం మొద‌లుపెట్టింది.
సందీప్ వంగ మొద‌లుపెట్టిన ఈ ఛాలెంజ్ రాజ‌మౌళి నుంచి వ‌రుస‌గా అంద‌రికి పాకేస్తోంది. ఎన్టీఆర్‌ని నామినేట్ చేస్తే ఎన్టీఆర్ చిరు, బాల‌య్య‌, నాగ్‌ల‌తో పాటు వెంక‌టేష్‌, కొర‌టాల‌ని నామినేట్ చేశాడు. త‌న టాస్క్‌ని పూర్తి చేసిన కొర‌టాల ఈ ఛాలెంజ్‌కి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని నామినేట్ చేశాడు.

అయితే త‌న‌ని అమ్మ‌ల ఇంట్లో ప‌నిచేయ‌నియ‌ట్లేద‌ని, ఇప్ప‌టికీ త‌న‌ని చిన్న పిల్ల‌ల్లానే ట్రీట్ చేస్తున్నార‌ని, ప‌ని చేస్తే డ‌బుల్ అవుతుంద‌ని మ‌మ్మి అంటోంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా లేట్‌గా లేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొరటాల ఇచ్చిన ఛాలెంజ్‌ని ఎలాగోలా పూర్తి చేశాడు. త‌న వీడియోని త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కండ చేత తీయించాన‌ని వెల్ల‌డించి కొర‌టాల‌కు వీడియోని పోస్ట్ చేశాడు.

దీనికి కొర‌టాల షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ఇలాగే చేస్తూ వీడు పిల్లోడు కాదు పెద్ద‌వాడు అయిపోయాడ‌ని అమ్మ‌తో త్వ‌ర‌లో అనిపించుకోవాల‌ని..` ట్వీట్ చేశాడు. దీనిపై న‌వ్వులు కురుస్తున్నాయి. ఇదిలా వుంటే విజ‌య్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఓవ‌రాక్ష‌న్ ఆపు అని కామెంట్‌లు చేస్తున్నారు.

https://twitter.com/sivakoratala/status/1253926724032532480