విల‌న్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన స‌ల్మాన్‌!

బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ త‌న‌కు న‌చ్చిన వాళ్ల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. త‌న స‌హ‌చ‌ర హీరోల‌తో పిల్ల‌ల్నిబాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌డంలోనూ, కొత్త వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేయ‌డంలోనూ ఎప్పుడూ ముందుండే స‌ల్మాన్ త‌న‌కు స‌హ‌క‌రించిన వారిని కూడా స‌ర్‌ప్రైజ్ చేసేందుకు ఏ విష‌యంలోనూ వెన‌కాడ‌రు. తాజాగా త‌న చిత్రంలో విల‌న్‌గా న‌టించిన ఓ న‌టుడి ఇంటికి వెళ్లి మ‌రీ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయ‌న‌కు ఖ‌రీదైన గిప్ట్ ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆశ్చ‌ర్యప‌రిచారు.

స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన తాజా చిత్రం `ద‌బాంగ్‌3`. ప్ర‌భుదేవా దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్నిసాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. ఇందులో విల‌న్‌గా క‌న్న‌డ స్టార్, `ఈగ‌` ఫేమ్ సుదీప్ న‌టించారు. త‌న సినిమాలో విల‌న్‌గా న‌టించిన సుదీప్‌ని స‌ల్మాన్ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆయ‌న ఇంటికి వెళ్లి ఖ‌రీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విష‌యాన్ని సుదీప్ ఇన్‌స్టాలో వెల్ల‌డించారు. `మీరు మంచి చేస్తే మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్మేలా సల్మాన్ స‌ర్ చేశారు. మా ఇంటికి ఆయ‌న‌తో పాటు బీఎమ్ డ‌బ్ల్యూ ఎమ్‌5ని తీసుకొచ్చి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. నాపై నా కుటుంబంపై చూపుతున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. మీతో క‌లిసి ప‌నిచేయ‌డం. మీరు మా కోసం రావ‌డం సంతోషంగా వుంది` అని పోస్ట్ చేశారు. స‌ల్మాన్‌తో దిగిన ఫొటోల‌ని అభిమానుల కోసం షేర్ చేశారు.