ఆర్జీవికి రచయిత జొన్నవిత్తులకు మధ్య కొన్ని రోజుల క్రితం మాట యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్జీవి హద్దులు దటి జొన్నవిత్తులని ఓ జోకర్లా ట్రీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా కా బుజ్జి జొన్నా బజ్జోరా.. అంటూ వ్యక్తగత విమర్శలకు దిగడంతో జొన్నవిత్తుల అహం దెబ్బతింది.
దీంతో ఆర్జీవిపై ఏకంగా సినిమా చేయడానికే సిద్ధమయ్యాడు. ఆర్జీవి ఓ కుహనా మేధావి అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడనీ, అతని ఇజం ఓ బూటకమని తెలియజేస్తూ ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. `కార్తికేయ` ఫేమ్ శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో బాల కుటుంబరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య హడావిడిగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ని కన్ఫమ్ చేశాడు జొన్నలవిత్తుల
సినిమా పేరు `ఆర్జీవి` అని పెట్టేశాడు. ట్యాగ్ లైన్‌గా `రోజూ గిల్లేవాడు` అని నామకరం చేసి సినిమాతో వర్మపై వార్ డిక్లేర్ చేశాడు. సురేష్, రాశి, శ్రద్ధా దాస్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తరువాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. ఈ సినిమాతో వర్మని గిల్లేస్తానని జొన్నవిత్తుల అనుకుంటున్నాడు కానీ తానే గిల్లించుకోబోతున్నాడని మాత్రం ఆయనకు ఎప్పటికి అర్థమవుతుందో అని సినీ జనం అంటున్నారు.