దర్శకుడు శంకర్ పక్కన రైటర్ సుజాత రంగరాజన్ ఉన్నంత వరకు వరుస విజయాల్ని సాధించారు. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తరువాత కె. విజయభాస్కర్ డైరెక్టర్‌గా తెరమరుగు కావాల్సి వచ్చింది. అదే తరహా ఇబ్బందిని దర్శకుడు వంశీ పైడిపల్లి ఎదుర్కొంటున్నారు. కెరీర్ తొలి నాళ్లలో కొరటాల శివపై ఆ తరువాత హరి అనే రైటర్‌పై ఆధారపడిన వంశీ పైడిపల్లి ఈ మధ్య కాలంలో అహిషోర్ సోలమన్ అనే అసోసియేట్ కమ్ రైటర్‌పై ఆధారపడుతూ వస్తున్నారట.
వంశీ పైడిపల్లి రూపొందించిన ఊపిరి, మహర్షి చిత్రాలకు అహిషోర్ సోలమన్ కో రైటర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయన నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న `వైల్డ్ డాగ్` చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన కారణంగానే వంశీ పైడిపల్లి రూపొందించిన ఊపిరి, మహర్షి చిత్రాలు విజయాల్ని సాధించాయి. అయితే ఇటీవల వంశీ టీమ్ నుంచి ఇతను తప్పుకోవడంతో వంశీ పైడిపల్లి ఆ లోటుని భర్తిచేయలేకపోతున్నాడ. ఆ కారణంగానే మహేష్‌ని ఆకట్టుకోలేకపోయాడని, కొన్ని నెలల క్రితం చెప్పిన లైన్‌ని ఆకట్టుకునే విధంగా మహేష్‌కు వినిపించలేకపోయాడని, డెవలప్‌మెంట్ కూడా కరెక్ట్‌గా లేకపోవడం వల్లనే వంశీ పైడిపల్లిని చిత్రాన్ని పక్కన పెట్టి పరశురామ్ చిత్రాన్ని మహేష్ ఓకే చేశారని తెలిసింది.
అంటే వంశీ పైడి పల్లికి అర్జెంట్‌గా ఓ రైటర్ కావాలి. అదే అన్వేషణలో వంశీ పైడిపల్లి వున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.