వెటరన్ దర్శకుడు భారతీరాజా మళ్లీ తలైవా రజనీకాంత్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న ఈయన రజనీకాంత్ నటిచిన తాజా చిత్రం `దర్బార్`పై విరుచుకుపడ్డారు. సినిమా వేడుకల్లో హీరోలు రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీకాంత్ స్థానికతపై సంచలన వ్యాఖ్యలు చేసి తమిళ చిత్ర పరిశ్రమలో వర్గ పోరుకు తెరలేపిన భారతీ రాజా సమయం చిక్కినప్పుడల్లా రజనీపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విరుచుకుపడుతూనే వున్నారు.
తాజాగా రజనీ సినిమా `దర్బార్`ని అత్యధిక రేట్లకు తీసుకుని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడి మళ్లీ వార్తల్లో నిలిచారు. `దర్బార్` ఫెయిల్యూర్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని. 50 కోట్లతో నిర్మించిన చిత్రానికి 400 కోట్లు వచ్చాయని ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు. 400 కోట్లు వసూలు చేస్తే మరి 350 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఎద్దేవా చేశారు. ఈ వాఖ్యలతో కోలీవుడ్ వాతావరణం వేడెక్కింది. దీనిపై రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ ఏమంటారో అని తమిళ మీడియా, కోలీవుడ్ బిగ్గీస్ ఎదురుచూస్తున్నారు.