WFL ప్రొమోషన్స్ కి దూరంగా విజయ్ దేవరకొండ!

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` రిలీజ్ బిఫోర్ ప్ర‌మోష‌న్‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా శుక్ర‌వారం రిలీజ్ అయి డివైడ్ టాక్‌ని సొంతం చేసుకోవ‌డంతో ఆ సినిమా భారాన్ని హీరోయిన్స్‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి వ‌దిలేసి త‌న కొత్త సినిమా షూటింగ్ వెళ్లిపోయాడు. పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌రకొండ `ఫైట‌ర్‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ డ్రీమ్‌ని నిజం చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మార్కెట్ కోసం రాజ‌మౌళి `బాహుబ‌లి`కి క‌ర‌ణ్ జోహార్‌ని దింపిన‌ట్టు పూరి కూడా అత‌న్నే ప‌ట్టుకున్నాడు. ఈ సినిమాకు క‌ర‌ణ్‌జోహార్ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్న విష‌యం తోలిసిందే. ఇటీవ‌లే ముంబైలో మొద‌లైన ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌యింది. `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోసం బ్రేకిచ్చిన రౌడీ శ‌నివారం `ఫైట‌ర్‌` సెట్‌లో వాలిపోయాడు. ఈ సినిమా కోసం మాసీవ్ రింగ్ ఫైట్స్‌ని పూరి ప్లాన్ చేశాడు. వాటిని ఆర్ట్ డైరెక్ట‌ర్ జాన్ రూపొందించార‌ట‌. సెట్‌లో శ‌నివారం అత‌ని పుట్టిన రోజుని చిత్ర బృందం సెల‌బ్రేట్ చేసి తాజా అప్‌డేట్‌ని వెల్ల‌డించింది.