మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` తరువాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు కీలక ఘట్టాల్ని చిత్రీకరించారు. దాదాపుగా యాభై శాతం పూర్తి చేసినట్టు తెలిసింది. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా కనిపించబోతున్నారు.
`ఆచార్య` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సినిమాలో 30 నిమిషాలు నిడివిగల కీలకమైన అతిథి పాత్ర ఒకటి వుంది. కథకు చాలా కీలకంగా నిలిచే ఈ పాత్రలో రామ్‌చరణ్ నటింస్తాడని, అది దర్శకుడు రాజమౌళి చేతుల్లోనే వుందని చిరు ఇటీవల వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే చిరు మరో రెండు చిత్రాల్ని లైన్లో ఎట్టారు. మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి `సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తారట.
ఈ రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతల్నిసుకుమార్తో పాటు మిగతా రైటర్స్‌ని తీసుకున్నారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయిస్తున్నట్టు తెలిసింది. దీనితో పాటు బాబీ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే బాబీ ఓ లైన్ వినిపించారట. లైన్ నచ్చడంతో డెవలప్ చేస్తే కలిసి సినిమా చేద్దామని మాటిచ్చారట. ప్రస్తుతం బాబీ లైన్‌ని స్క్రిప్ట్‌గా చేసే పనిలో వున్నాడట.