లాక్ డైన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రిలీజ్‌కి సిద్ధమైన సినిమాలు, షూటింగ్‌లు మధ్యలోనే ఆపేసిన సినిమాల కారణంగా భారీ నష్టాలని చవిచూస్తోంది. ఇదిలా వుంటే లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగించే అవకాశాలే ఎక్కువగా వుండటంతో ఈ నెలలో రిలీజ్‌కు సిద్ధమైన చిత్రాలపై రూమర్‌లు మొదలయ్యాయి.
రామ్ తరుణ్ నటిస్తున్న `ఒరేయ్ బుజ్జిగా` థియేట్రికల్ రిలీజ్ కష్ఠమే అని డిజిటల్ ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటూ ప్రచారం మొదలుకావడంతో నిర్మాత ఆ వార్తల్లో నిజం లేదని, మా చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తానని స్పష్టం చేయాల్సి వచ్చింది. తాజాగా ఇదే తరహా వార్త ఒకటి రామ్ నటిస్తున్న `రెడ్` సినిమాపై చక్కర్లు కొడుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు.
లాక్ డౌన్ పొడిగించే అవకాశం వుండటంతో ఈ చిత్రాన్ని టిజిటల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో రిలజ్ చేస్తో 20 కోట్లు ఇస్తామని ఓ సంస్థ ఆఫర్ కూడా ఇచ్చిందట. అయితే ఈ రూమర్‌లపై రామ్ స్పందించాడు. థియేట్రికల్ రిలజ్ విషయంలో ఎలాంటి డైలమా లేదని, ఖచ్చితంగా `రెడ్`ని థియేట్రికల్ రిలీజే చేస్తామని స్పష్టం చేశాడు.