రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది?  

ramcharan
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ కాంబినేషన్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ఎప్పటికప్పుడు ఆసక్తి విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లు కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఇండస్ట్రీలోనే కాదు, వారి అభిమానుల్లోనూ  ఈ క్రేజీ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే..
 
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన కొత్త సినిమాకి  సంబంధించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. చాలామంది దర్శకులు రామ్ చరణ్ ను కథలు వినమని చెప్పినా రామ్ చరణ్ ససేమిరా అంటూ తప్పించుకున్తున్నాడట. కారణాలు తెలియక దర్శక,నిర్మాతలు తలలు పీక్కుంటున్నారట. చరణ్ అభిమానుల సైతం తమ హీరో తరువాత సినిమా ఏమిటి ? ఎలా ఉండబోతోంది?  డైరెక్టర్ ఎవరు ? అని ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
అయితే ఓ నిర్మాత రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ రాయడానికి మరో క్రేజీ దర్శకుడు  త్రివిక్రమ్‌ను సంప్రదించినట్లు ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. అలాగే  ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత, చరణ్ తోనే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో త్రివిక్రమ్-చరణ్ లు మాత్రమే స్పష్టం చేయాల్సివుంది!?