`బాహుబలి` విజయంతో తెలుగు సినిమా స్వరూపమే ప్రంచ యవనికపై సమూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వస్తోందంటే దేశ వ్యప్తంగా అటెన్షన్ క్రియేట్ అవుతోంది. తాజాగా జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్`పై కూడా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకరు బ్రిటీష్ ఇండియాపై మరోకరు నిజాం నిరంకుశంపై తిరుగుబాటు బావుటాని ఎగురవేసిన యోధుల కథని ఈ సినిమాలో చూపించబోతుండటంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
ఇందులో ఎన్టీఆర్ విప్లవ వీరుడు కొమరం భీంగానూ, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం రోమాంచితంగా వుంటుందని తెలుస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్‌పై `300` స్ఫూర్తితో పులి ఫైట్‌ని చిత్రీకరించారట. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి బయటికి వచ్చి హల్‌చల్ చేస్తోంది.
ఇదిలా వుంటే ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారట. అదేంటి అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ ఏంటీ అని డౌట్ రావచ్చు. తెల్లవాళ్ల ఎత్తుగడలు తెలుసుకునే క్రమంలో రామ్‌చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలిసింది. అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి ఓ సన్నివేశంలో ఈ సీన్ వుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.