నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రంలో ప్రేక్షుకులకు తనను ఇంతవరకు చూడని వేషధారణలో కనిపించి ఆనందం కలిగించనున్నారు. తన ఈ 105 వ చిత్రం హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. సి.కల్యాణ్ చిత్ర నిర్మాత. జైసింహా చిత్రం తర్వాత మళ్ళీ ఈ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్రమిది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ నిన్నటి నుండి రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్‌లో భాగంగా అన్బు, అరవి అధ్వర్యంలో భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనపడతారు. ఇటీవల విడుదలైన ఓ లుక్‌కి, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.