రానా దగ్గుబాటి తన ప్రేయసి మిహీక బజాజ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 ముహూర్తం ఫిక్సయింది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. దగ్గుబాటీస్ సహా బజాజ్ ఫ్యామిలీ ఎవరికి వారు పెళ్లికి అవసరమైన డిజైనర్ దుస్తులు ఆభరణాల డిజైన్స్ ని ఎంపిక చేసుకున్నారు. వీటితో పాటు ఒక సాధా సీదా విందు కార్యక్రమానికి ప్లాన్ ని రెడీ చేశారు. వైరస్ మహమ్మారీ ఈ పెళ్లిని సాధా సీదాగా మార్చేయడంతో సింపుల్ గా కానిచ్చేస్తున్నారని సమాచారం.
కేవలం రానా స్నేహితులు బంధుమిత్రులు.. మిహీక తరపు బంధుమిత్రులు 50 మంది మాత్రమే పాల్గొనే వీలుంది. ఇండస్ట్రీలో ఘనంగా నిర్వహించే పెళ్లి కానే కాదని తెలుస్తోంది. తాజాగా మిహీకా సోషల్ మీడియాలో పెళ్లి రోజు వరుడు ధరించే జూటిస్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో రానా అభిమానుల్లో వైరల్ గా మారింది.
అల్లుడు గారికి అరుదైన కానుక ఇవి.. పెళ్లి రోజున చక్కగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఫిజ్జీ గోబ్లెట్ జూటిస్ ధరిస్తారన్నమాట. రానా- మిహీక జంట వివాహం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరుగుతుంది. ఇంతకుముందు ఇదే వేదికపై సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం.. హీరో ఆర్య- సయేషా జంట వివాహం ఇక్కడ జరిగింది. విందును భారీగా ప్లాన్ చేశారు. అయితే మహమ్మారీ వల్ల రానాకు అంత ఘనమైన విందు వినోదాలకు ఆస్కారం లేదు.