రాడిక‌ల్ స్టూడెంట్‌గా స్టార్ హీరో?

వెండితెర‌పై అరుదైన ఆవిష్క‌ర‌ణ‌లు మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు స్టార్ హీరోల‌ని క‌లిపి రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని రూపొందిస్తుంటే అదే త‌ర‌హా అరుదైన క‌ల‌యిక‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తన తాజా చిత్రం కోసం ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని కొర‌టా శివ తెర‌కెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో మ‌హేష్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌రువాత వంశీ పైడిప‌ల్లితో చేయాల‌నుకున్న సినిమా ఆగిపోవ‌డం, అదే స‌మ‌యంలో మ‌రో ప్రాజెక్ట్‌కు స‌మ‌యం వుండ‌టంతో చిరు చిత్రంలో కీల‌క అతిథి పాత్ర చేయ‌డానికి మ‌హేష్ అంగీక‌రించిన‌ట్టు చెబుతున్నారు. కొర‌టాల శివ, చిరు కార‌ణంగా ఈ సినిమాని మ‌హేష్ అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీని కోసం భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. 30 రోజులు అవ‌స‌కం వుండ‌టంతో మ‌హేష్ డేట్స్ కూడా కేటాయించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో మ‌హేష్ రాడిక‌ల్ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్‌గా క‌నిపిస్తార‌ని, పాత్ర నిడివి 24 నిమిషాల నుంచి 30 నిమిషాల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. అందులో 15 నిమిషాల పాటు చిరు కాంబినేష‌న్‌లోనే వుంటుద‌ని, ఓ పాట‌, ఫైట్ కూడా మ‌హేష్‌పై ప్ర‌త్యేకంగా చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది.