రజని సినిమాలో ట్రాన్సజెండర్?

రజిని సినిమాలో ఏ పని చేసినా అది జనాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం ఆయన మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజిని ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ఆయన సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా కోసం దర్శకుడు జీవా అనే ఒక ట్రాన్సజెండర్ ఆర్టిస్ట్ ను తీసుకున్నట్టు సమాచారం. ఈమె విజయ్ సేతుపతి ‘ధర్మ దురై’ లో ఒక కీలక పాత్ర పోషించింది.

ఈ వార్త తెలియగానే ఎంతో మంది దర్శకుడి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.