మ‌హేష్‌, బ‌న్నీకి త‌మ్మారెడ్డి చుర‌క‌లు!

సంక్రాంతికి రిలీజైన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో మంచి విజ‌యాల్ని ద‌క్కించుకున్నాయి. అయితే ఒక సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అంటే మ‌రో సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల్ని సాధించింద‌ని, స‌మం చేసింద‌ని.. బాహుబ‌లి త‌రువాత మా సినిమానే సూప‌ర్ అంటే మా సినిమానే సూప‌ర్‌ అంటూ హీరోలు, వాళ్ల అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కొట్టుకుంటున్నారు. దీనికి తోడు బ‌న్నీ నా సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అని, నాన్ బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాసింద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్రెస్ మీట్‌లు పెట్టి మ‌రీ ఊద‌ర‌గొట్టేస్తున్నారు.

దీనిపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇటీవ‌ల స్ట్రాంగ్ కౌంట‌ర్ వేశారు. మా హీరో సూప‌ర్ మాదే ఆల్ టైమ్ రికార్డ్ లేదు లేదు మా హీరోనే సూప‌ర్ మాదే ఆల్ టైమ్ రికార్డ్.. తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌ని తిర‌గ‌రాసిన సినిమా మాదంటే మాదే అంటూ ఎందుకురా కొట్టుకుంటారు. బాహుబ‌లి త‌రువాత ఎవ‌రైనా. బాహుబ‌లిని దాటిన రోజున మీరిద్ద‌రు మాట్లాడండియంటూ ప‌రోక్షంగా మ‌హేష్‌, బ‌న్నీల‌కు చుర‌క‌లంటించారు. ఇద్ద‌రు హీరోలు సూప‌ర్‌హిట్లు రావ‌డంతో బాగున్నారు. మ‌ధ్య‌లో మీకేం పోయే కాలం.. ఎందుకు కొట్టుకు చ‌స్తున్నార‌ని ఫ్యాన్స్‌ని కూడా ఏకిపారేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.