టాలీవుడ్ హీరోల హవా నడుస్తోంది. గతంతో పోలిస్తే `బాహుబలి` తరువాత స్టార్ హీరోల మార్కెట్ పెరిగింది. దీంతో బిగ్ హీరోలు రెమ్యునరేషన్ మాట పక్కన పెట్టేసి లాభాల్లో వాటా అంటూ కొత్త పల్లవిని వినిపిస్తున్నారు. `బాహుబలి` సినిమాతో ఈ పంథాకు ప్రభాస్ శ్రీకారం చుడితే దాన్నే మిగతా హీరోలు ఫాలో అవుతున్నారు. ఇటీవల సంక్రాంతికి రిలీజైన `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి మహేష్ పారితోషికం కాకుండా లాభాల్లో వాటా కింద 50 కోట్లు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన తదుపరి చిత్రానికి కూడా ఇదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నాడట. వంశీ పైడిపల్లి చిత్రాన్ని పక్కన పెట్టి మైత్రీ మూవీమేకర్స్ కోసం పరశురామ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నడని వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేష్ 50 కోట్లు తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఇందు కోసం ఇప్పటికే మైత్రీతో మహేష్ బిగ్‌డీల్‌ని కుదుర్చుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. మైత్రీతో పాటు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ కూడా భాగస్వామిగా వ్యవహరించనుందట.