మెగాస్టార్ కు తమిళ స్టార్ గొంతు..

కొణిదెల ప్రొడక్షన్స్ వారి ప్రతిష్టాత్మకమైన సినిమా ‘సై రా’. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఈ సినిమాకు తెలుగులో వాయిస్ ఓవర్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

ఇకపోతే ఈ సినిమా తమిళ వెర్షన్ వాయిస్ ఓవర్ ను కమల హాసన్ ఇచ్చారు. ఇక ఈ తమిళ ‘సై రా’ లో మెగాస్టార్ పాత్రకు తమిళ నటుడు అరవింద్ స్వామి దుబ్బింగ్ చెప్పనున్నారు. ఈ విషయమై ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కాదు మరి ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్లు నటిస్తున్న ఈ సినిమాలో అందులోను మెగాస్టార్ పాత్రకు దుబ్బింగ్ చెప్పడమంటే చాలా మంచి అవకాశమని చెప్పాలి.