టాలీవుడ్ తెరపై తనదైన స్టైల్స్‌తో మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుని మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఫైట్సుల్లో, డ్యాన్సుల్లో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ మాస్ ఆడియన్స్‌కి డెమిగాడ్‌గా మారిపోయారు. 90వ దశకంలో ఆయన సినిమా అంటే థియేటర్ల ముందు బారులు తీరాల్సిందే, వెండితెర ఆయన కనిపిస్తే పూల వర్షం కురవాల్సిందే. ఇంతగా యువతని ప్రభావితం చేసిన ఆయన సోషల్ మీడియాకు మాత్రం దూరంగా వుంటూ వస్తున్నారు.
తాజాగా ఎంట్రీ ఇచ్చారు. Chiranjeevi Konidela @KChiruTweets ఐడీతో ఆయన ట్వీట్‌లు చేయడం మొదలుపెట్టారు. ఆయన చేసిన తొలి ట్వీట్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూనే కలిసి కట్టుగా కరోనా మహమ్మారిపై పోరటానికి కంకణం కట్టుకుందామని ట్వీట్ చేశారు. ఇంటి పట్టున ఉంటూనే సురక్షితంగా వుందామని సందేశాన్ని అందించారు. మెగాస్టార్‌ని ఫాలో అవుతున్న వారి సంక్ష క్షణ క్షణానికి వేలల్లో పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంక్ష 68.1కేకు చేరింది. ఒక్కరోజే కోటి దాటిన ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.