మెగాస్టార్‌ని ఢీకొట్టేది క‌లెక్ష‌న్ కింగేనా?

మెగాస్టార్ చిరంజీవి -క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు అనుబంధం ఎలా ఉండేదో `మా `డై రీ అవిష్క‌ర‌ణ వేదిక‌గా మోహ‌న్ బాబు రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు టామ్ అండ్ జెర్రీ లా ఉంటారు త‌ప్ప ఎలాంటి వివాదాలు లేవ‌ని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో మంచు ఫ్యామిలీ – మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ఫ‌ర్ధ‌లు లేవ‌ని మొన్న‌టి స‌న్నివేశంతో తేలిపోయింది. ఈ వివాదం ప‌క్క‌న‌బెడితే చిరంజీవి-మోహ‌న్ స‌మ‌కాలీకులు. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు.

బిల్లా రంగా, ప‌ట్నం వ‌చ్చిన ప్ర‌తివ్ర‌తలు లో హీరోలుగా న‌టించారు. ఇంకా చిరు హీరోగా న‌టించిన ఎన్నో చిత్రాల్లో మోహ‌న్ బాబు విల‌నిజం ప‌డించారు. తాజాగా ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ చిరు – మోహ‌న్ బాబులు క‌లిసి న‌టిస్తున్నారు అన్న ఓ ఆస‌క్తిర వార్త టాలీవుడ్ స‌హా ప్రేక్ష‌కుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడు ఆయ‌న 152వ చిత్రానికి కొర‌టాల శ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మోహ‌న్ బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని కొంద‌రంటే? మ‌రికొంద‌రు చిరంజీవి విల‌న్ గా ఢీ కోట్ల‌బోతున్నార‌ని అంటున్నారు.

ఈ రెండు వార్త‌లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గామారిపోయియి. అదే నిజ‌మైతే కాంబినేష‌న్ అదిరిపోయిన‌ట్లే. మా డైరీ లాంచ్ లో మోహ‌న్ బాబు మాట‌ల‌ను మెచ్చిన చిరంజీవి ఆప్యాయంగా కౌగిలించుకుని మంచి స‌మకాలికులు అనిపించారు. ఇటీవ‌లే మోహ‌న్ బాబు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌సన్న త‌మ రెండు కుటుంబాలు మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.